
జిగేల్.. జిగేల్..
ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే క్రమంలో వివిధ రకాల డిజైన్లతో సీలింగ్, ఇతర పనులను చేయిస్తున్నారు. యజమానులు, నిపుణుల ద్వారా ఈ డిజైన్లను తయారు చేయించి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పీఓపీ, జిప్సం బోర్డులు, లైటింగ్, వాల్ పేయింట్స్, టెక్షర్ వాల్ పేపర్లు, ఫర్నిచర్, ఉడ్ వర్క్‌పై లామినేట్స్ తెప్పించి కంటికి అందంగా కనిపించేలా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం దిగుమతి చేసుకున్న ఆకర్షణీయమైన వస్తువులు, స్థానికంగా లభించే అందమైన కళాకృతులు, వేలాడే లైట్లు, కిటికీలు, టీ పాయ్ సొగసులు, ప్రత్యేక లైట్లతో సీలింగ్ డిజైన్లు ఆకర్షించేలా నిర్మించుకుంటున్నారు. విద్యుత్ దీపాల వెలుగులో ఇల్లంతా మరింత జిగేల్.. జిగేల్ మనేలా మార్చుకుంటున్నారు. ఇలా ఇంటిని బట్టి కేవలం ఇంటీరియర్ కోసమే సుమారు రూ.పది లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వెచ్చిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం కాలానుగుణంగా ఒకరిని చూసి మరొకరు ఇంటిని నిర్మాణాన్ని చేపడుతున్నారు.

జిగేల్.. జిగేల్..