కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి | Sakshi
Sakshi News home page

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి

Published Tue, May 14 2024 12:55 PM

కట్టు

కలెక్టర్‌ హరిచందన

నల్లగొండ : ఈవీఎంలను భద్రపరిచే గోదాంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరిచందన సూచించారు. సోమవారం నల్లగొండ సమీపంలోని అనిశెట్టిదుప్పలపల్లి వద్ద ఉన్న గోదాముల్లోని కౌంటింగ్‌ కేంద్రాన్ని, స్ట్రాంగ్‌ రూమ్‌లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్‌ కేంద్రాల ఆవరణ మొత్తం లైటింగ్‌ ఏర్పాటు చేయాలని, పోలీస్‌ సెక్యూరిటీకి అవసరమైన వసతి కల్పించాలని ఆదేశించారు. వర్షం వచ్చినా ఇబ్బంది కాకుండా అవసరమైన టార్పాలిన్లు సిద్ధం చేయాలన్నారు. ఈవీఎంలను స్వీకరించే సమయంలో సిబ్బంది, సెక్టోరల్‌ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆమె వెంట పంచాయతీరాజ్‌ ఈఈ భూమన్న, అధికారులు ఉన్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతం

ఎస్పీ చందనాదీప్తి

నల్లగొండ క్రైం : జిల్లాలో పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. సోమవారం పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ తీరును ఆమె పరిశీలించారు. పోలీస్‌ అధికారులు, సిబ్బందికి.. ఎన్నికల నిర్వహణ, పోలింగ్‌ తరువాత ఈవీఎంలను కౌంటింగ్‌ కేంద్రాలకు తరలింపుపై పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రం సమీపంలో అనిశెట్టిదుప్పలపల్లి గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మహా శివుడికి పూజలు

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఆధ్యాత్మిక పర్వాలు కొనసాగాయి. కొండపైన ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు నిర్వహించారు. మహాశివుడికి ఇష్టమైన రోజు కావడంతో అభిషేక పూజలు చేపట్టారు. ఇక ప్రధానాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఇక ఆలయ ముండపం, ప్రాకార మండపంలో నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు.

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి
1/1

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి

 
Advertisement
 
Advertisement