
ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు
కందనూలు: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం నిర్వహించిన సోషల్ స్టడీస్ పరీక్షకు 10,555 మంది విద్యార్థులకు గాను 10,529 మంది హాజరు కాగా.. 26 మంది గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. గతనెల 21న ప్రారంభమైన పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగాయని చెప్పారు. ఎలాంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఏ చిన్న ఘటన చోటు చేసుకోకుండా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించారన్నారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ అమరేందర్, వివిధ శాఖల అధికారులు సందర్శించి, పరీక్షలు సజావుగా జరిగేలా పలు సూచనలు చేశారని.. అందుకు అనుగుణంగా పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించినట్లు డీఈఓ తెలిపారు.
డీ కోడింగ్ ప్రక్రియ..
ఇతర జిల్లాల నుంచి వస్తున్న జవాబు పత్రాలను విద్యాశాఖ అధికారులు డీ కోడింగ్ ప్రక్రియను చేపట్టారు. అందుకోసం సిబ్బందిని నియమించారు. వచ్చిన జవాబు పత్రాలు ఏ జిల్లావో తెలియకుండా, వాటికి వేరే నంబర్ ఇచ్చి కంప్యూటరీకరణ చేస్తున్నారు. డీ కోడింగ్‌లో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. కాగా, జిల్లాకు 1,33,631 జవాబు పత్రాలను కేటాయించినట్లు డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. మూల్యాంకనం కోసం ఇద్దరు కోడింగ్ అధికారులు, ఐదుగురు సహాయ కోడింగ్ అధికారులు, ఏడుగురు సహాయకులతో పాటు చీఫ్ ఎగ్జామినర్లు 64 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 384 మంది, స్పెషల్ అసిస్టెంట్లు 130 మందిని కేటాయించినట్లు వెల్లడించారు.
మూల్యాంకనానికి పకడ్బందీగా ఏర్పాట్లు

ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు