నాగర్‌కర్నూల్ క్రైం: ప్రతి మనిషి జీవించి ఉండాలంటే కిడ్నీలు ఆరోగ్యవంతంగా ఉండాలని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘు అన్నారు. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా జనరల్ ఆస్పత్రి డయాలసిస్ సెంటర్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రజల్లో అవగాహన అవసరమని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అందరికీ కిడ్నీలు కేవలం వ్యర్థాలను ఫిల్టర్ చేయడానికి మాత్రమే అనుకుంటారని, మానవ శరీరంలో ప్రధానమైన పాత్ర పోషిస్తాయని, కిడ్నీలు దెబ్బతింటే జీవన విధానం మారిపోతుందన్నారు. ఆరోగ్యంగా జీవించడం చాలా కష్టంగా మారుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓలు రవిశంకర్, అజిమ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.