
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ములుగు రూరల్: ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్ల పెండింగ్ వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న స్కావెంజర్లకు ప్రభుత్వం ఏడు నెలల నుంచి వేతనాలు అందించడం లేదన్నారు. స్కావెంజర్ల వేతనాలు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా కాకుండా ప్రభుత్వం నేరుగా చెల్లించాలని కోరారు. స్వీపర్లు, స్కావెంజర్లకు కనీస వేతనాలు వేతనాలు నేరుగా ఖాతాలలో జమ చేయాలని కోరారు. ఈ నెల 9న జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి నర్సయ్య, ముత్యాల రాజు, సామల రమ, మునెమ్మ, కమలక్క, రాజమ్మ, రమాదేవి, పద్మ, నిర్మల, కమల తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
రవీందర్