అందుకే రిషబ్‌ భయ్యా పెళ్లి చేసుకోవడం లేదు.. ఊర్వశిపై దారుణ ట్రోల్స్! | Urvashi Rautela SLAMS News Portals Over Coverage Of Her Hospitalisation And Trolling On Her Video, Goes Viral | Sakshi
Sakshi News home page

Urvashi Rautela: సోషల్ మీడియాలో ఊర్వశి రౌతేలా పోస్ట్‌.. ఓ ఆటాడుకున్న నెటిజన్స్‌!

Aug 22 2024 3:34 PM | Updated on Aug 22 2024 3:53 PM

Urvashi Rautela SLAMS News Portals Over Coverage Of Her Hospitalisation

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి పరిచయం ‍అక్కర్లేదు. వాల్తేరు వీరయ్య, ఏజెంట్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఊర్వశి చివరిసారిగా బాలీవుడ్‌లో గుస్పైతియా చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ చిత్రంలో కనిపించనుంది ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా.. తాను ఆస్పత్రిలో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన చేతికి అయిన గాయాన్ని చూపిస్తూ తన కోసం ప్రార్థించండి అంటూ పోస్ట్ చేసింది.

అయితే ఊర్వశి రౌతేలా పోస్ట్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. అంత చిన్న మైనర్‌ గాయానికి ఆస్పత్రిలో ఎందుకు అడ్మిట్ అయ్యారని నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ వీడియోపై ఒకరు స్పందిస్తూ.. వేలికి చిన్న గాయంతో ఆసుపత్రిలో చేరిన మొదటి భారతీయ మహిళ అని ఫన్నీగా కామెంట్స్ చేశాడు. మరొకరు అంతర్జాతీయ స్థాయిలో గాయపడిన మొదటి భారతీయ మహిళ ఊర్వశి అని రాసుకొచ్చాడు. ఇంత చిన్న గాయానికి ఏకంగా ఆక్సిజన్‌ తీసుకుంటున్నారా? అసలేంటి నాన్‌సెన్స్‌ అంటూ కామెంట్ చేశాడు. ఇలాంటి ప్రవర్తన కారణంగానే రిషబ్ భాయ్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం లేదంటూ ఓ నెటిజన్‌ రాశారు. అయితే నెటిజన్ల నుంచి పూర్తి వ్యతిరేకత రావడంతో బాలీవుడ్ భామ ఆశ్చర్యపోయింది.

అంతేకాకుండా తనపట్ల మీడియాలో వస్తున్న వార్తలపై ఊర్వశి రౌతేలా మండిపడింది. త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు చెప్పే బదులు.. తనపై అన్ని హద్దులు దాటి ప్రవర్తించడంతో నిరాశకు గురయ్యానని తెలిపింది. ఇటువంటి విపరీతమైన, అగౌరవపరిచే సంస్కృతి సమాజంలో అత్యాచారం లాంటి దారుణమైన చర్యలకు పునాదిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆ వార్త ప్రచురించిన క్లిప్‌ను కూడా షేర్ చేసింది ముద్దుగుమ్మ. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement