Hindi Webseries In OTT: ఓటీటీలో రాబోయే టాప్‌ 10 బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ ఇవే..

Top 10 Upcoming Bollywood Web Series In OTT - Sakshi

Top 10 Upcoming Bollywood Web Series : కరోనా కారణంగా థియేటర్స్‌ మూతపడటంతో భారత్‌లో ఓటీటీల హవా మొదలైంది. గత రెండేళ్ల నుంచి జనాలు థీయేటర్స్‌ కంటే ఓటీటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే భారీ బడ్జెట్‌ చిత్రాలు సైతం నేరుగా ఓటీటీలలో రిలీజ్‌ అవుతున్నాయి. మూవీస్‌తో పాటు ఢిపరెంట్‌ కాన్సెఫ్ట్‌తో వెబ్‌సిరీస్‌లు సైతం ఓటీటీల ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా కొత్త కాన్సెఫ్ట్‌తో తెరకెక్కిస్తున్న వెబ్‌ సిరీస్‌లను ఆదరిస్తున్నారు. దీంతో దర్శకనిర్మాతలు ఇంతకుముందు రిలీజ్‌ అయిన వెబ్‌ సిరీస్‌లకు ప్రీక్వెల్‌, సీక్వెల్‌లను ప్లాన్‌ చేసి విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు మిమ్మల్నీ మరింతగా ఎంటర్‌టైన్‌ చేసేందుకు వస్తున్న వెబ్‌ సిరీస్‌లపై ఓ లుక్కేయండి. 

1. స్పెషల్‌ ఆప్స్‌ 1.5

మార్చ్‌ 17, 2020న రిలీజ్‌ అయిన స్పెషల్‌ ఆప్స్‌ వెబ్‌ సిరీస్‌.. స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కింది. 'రా' ఏజెంట్‌గా హిమ్మత్‌ సింగ్‌ ( కే.కే. మీనన్‌ ) తన టీమ్‌తో ఎలాంటి ఆపరేషన్స్‌ చేశాడనేదే కథ. అయితే ఇప్పుడు హిమ్మత్‌ సింగ్‌ 'రా' ఏజెంట్‌గా జాయిన్‌ అయిన తొలినాళ్లలో ఎదుర్కొన్న సవాళ్లు, హనీ ట్రాప్‌ కథాంశంగా స్పెషల్‌ ఆప్స్‌ 1.5 రాబోతోంది. 

ఓటీటీ: డిస‍్నీ+హాట్‌స్టార్‌
రిలీజ్‌: నవంబర్‌ 12

2. ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌- సీజన్‌ 3

క్రికెట్‌కు ఎంతమంది అభిమానులును ఉన్నారో చెప్పక్కర్లేదు. ఈ క్రికెట్‌ నేపథ్యంతో విడుదలైన ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ సీజన్ 1, సీజన్‌ 2లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా క్రికెట్‌ అభిమానులకైతే ఓవర్‌లో సిక్స్‌ బౌండరీస్‌ కొట్టినంత కిక్కిచ్చాయి. అంగద్‌ బేడీ, తనూజ్‌ విర్వానీ, రిచా చద్దా, వివేక్ ఒబేరాయ్‌, సిద్ధాంత్‌ చతుర్వేదీ నటించిన ఈ సిరీస్‌కు మరో సీక్వెల్‌ రాబొతున్నట్లు అమెజాన్ ప్రైమ్‌ ట్విటర్‌ వేదికగా తెలిపింది. అయితే విడుదల తేదిని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. 

3. అసుర్‌- సీజన్‌ 2

అసుర్‌- వెల్‌కమ్‌ టు యువర్‌ డార్క్‌ సైడ్‌ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ వూట్‌ ఓటీటీలో అత్యధికంగా జనాధరణ పొందింది. హిందూ మైథాలజీతో హత్యలు చేసే ఓ సీరియల్‌ కిల్లర్‌ కథే ఈ అసుర్‌. దీనికి రెండో సీజన్‌ వస్తున్నట్లుగా వూట్‌ సంస్థ ప్రకటించింది. మీ సీట్‌ను గట్టిగా పట్టుకుని కూర్చోండి.. మిమ్మల్ని థ్రిల్‌ చేసే బెస్ట్‌ కథలు వస్తున్నాయని ట్విటర్‌లో తెలిపింది. 

4. స్కామ్‌ 2003

సోనీ లైవ్‌లో విడుదలై బిగ్గెస్ట్ హిట్‌ సాధించింది స్కామ్‌ 1992. ఈ సక్సెస్‌తో రెట్టించిన ఉత్సాహంతో ఈ ఫ్రాంచైజీలో మరో వెబ్‌ సిరీస్‌ తీస్తున్నట్లు ప్రకటించింది అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. నకిలీ స్టాంప్‌ పేపర్లతో కోట్లు గడించిన అబ్దుల్‌ కరీమ్‌ తెల్గీ కేసుపై ఈ సిరీస్‌ వస్తోన్నట్లు పేర్కొంది. 

5. ఆర్య- సీజన్‌ 2 

బాలీవుడ్‌ నటీ సుస్మితా సేన్‌ నటించి, హిట్‌ కొట‍్టిన వెబ్ సిరీస్‌ ఆర్య. క్రైమ్‌ థ్రిల్లర్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌కు రామ్‌ మాధవానీ, సందీప్‌ మోడీ, వినోద్‌ రావత్‌ దర్శకత్వం వహించారు. సుస్మీత సేన్‌, చంద్రచూర్‌ సింగ్‌, నమితా దాస్‌, అంకూర్‌ భాటియా, వికాస్‌ కుమార్‌ నటించిన ఈ సిరీస్‌కు మరో సీక్వెల్ రానున్నట్లు డిస్నీ+హాట్‌స్టార్‌ తెలిపింది. ఈ సిరీస్‌ విడుదల తేదిని కూడా ఇంకా ప్రకటించలేదు. 

ఇలా రానున్న మరికొన్ని వెబ్‌ సిరీస్‌ సీక్వెల్స్‌..

6. షీ- సీజన్‌ 2(నెట్‌ఫ్లిక్స్‌)
7. మసబా.. మసబా.. సీజన్‌ 2(నెట్‌ఫ్లిక్స్‌)
8. ఢిల్లీ క్రైమ్‌ 2(నెట్‌ఫ్లిక్స్‌)
9. మేడ్‌ ఇన్‌ హెవెన్‌ 2(అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో)
10. జమ్తారా సీజన్ 2(నెట్‌ఫ్లిక్స్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top