అమ్మాయిలూ ప్రాణాలర్పించగలరు | tere ishq mein kriti sanon to play lead role opposite dhanush | Sakshi
Sakshi News home page

అమ్మాయిలూ ప్రాణాలర్పించగలరు

Jan 29 2025 2:26 AM | Updated on Jan 29 2025 2:26 AM

tere ishq mein kriti sanon to play lead role opposite dhanush

ప్రేమ కోసంప్రాణాలర్పించే ధైర్యం అమ్మాయిలకూ ఉంటుందని చెబుతున్నారు హీరోయిన్‌ కృతీ సనన్‌(kriti sanon). ‘రాంఝాణా (2013), అత్రంగి రే (2021)’ చిత్రాల తర్వాత హీరో ధనుష్(dhanush), దర్శకుడు ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న రొమాంటిక్‌ లవ్‌స్టోరీ ‘తేరే ఇష్క్‌ మే’(tere ishq mein). 2023లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటికీ కొన్ని కారాణాల వల్ల ఇంకా చిత్రీకరణ ఆరంభించలేదు. ఈ ఏడాది ఈ చిత్రం షూటింగ్‌ మొదలు పెట్టాలనుకుంటున్నారు.

కాగా ఈ మూవీలో ధనుష్‌ సరసన హీరోయిన్‌గా ముక్తి అనే పాత్రలో కృతీ సనన్‌ నటించనున్నట్లు మంగళవారం వెల్లడించి, ఈ పాత్ర తాలుకూ వీడియోను రిలీజ్‌ చేశారు. ‘‘శంకర్‌... (ధనుష్‌ పాత్రను ఉద్దేశించి కావొచ్చు) ప్రేమ కోసం అబ్బాయిలే ప్రాణాలర్పిస్తారా? కొంతమంది అమ్మాయిలకు కూడా ఆ ధైర్యం ఉంది’ అని అర్థం వచ్చేలా కృతీ సనన్‌ హిందీలో డైలాగ్స్‌ చెబుతూ, ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని, ఆత్మహత్యాయత్నానికి రెడీ అవుతున్న విజువల్స్‌ కనిపిస్తాయి. నవంబరు 28న హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement