Sunny Leone Received Hate Mail And Death Threats From India, Check Here's Why - Sakshi
Sakshi News home page

Sunny Leone: ఆ బెదిరింపులతో భయాందోళనకు గురయ్యా: సన్నీ లియోన్

Dec 26 2022 9:35 PM | Updated on Dec 27 2022 9:29 AM

Sunny Leone reveals about hate mails and death threats from India at the age of 20 - Sakshi

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ జిన్నా మూవీతో టాలీవుడ్‌లో అలరించింది.  మంచు విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ఇటీవల ఓ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. గతంలో ఆమెకు ఎదురైన భయానక సంఘటనలను తలుచుకుని భావోద్వేగానికి గురైంది.  ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో బెదిరింపులు వచ్చాయని.. నేను తిరిగి ఇండియాకు వస్తానని అనుకోలేదని సన్నీ తెలిపింది.

సన్నీ లియోన్ మాట్లాడుతూ..' నా కెరీర్‌ ప్రారంభంలో బెదిరింపు మెయిల్స్‌ వచ్చేవి. చంపేస్తామంటూ సందేశాలు పంపేవాళ్లు. అధిక సంఖ్యలో ఇండియా నుంచి వచ్చేవి.  ఇక్కడ ప్రజలు నాపై చాలా కోపంగా ఉన్నారని అనుకున్నా. అవీ నన్ను తీవ్ర ప్రభావితం చేశాయి. అప్పుడు నా వయసు కేవలం 20 ఏళ్లే. ఆ సమయంలో నాకు మంచిచెడులు చెప్పడానికి ఎవరూ లేరు.  ఇప్పుడు ఆ పరిస్థితులు ఎదురైతే నన్నేం చేయలేవు.  ఇప్పుడు నేను మానసికంగా చాలా బలంగా ఉన్నా.' అని ఆమె అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement