సన్నీ లియోన్ షాకింగ్ లుక్.. 'క్యూజీ' ట్రైలర్ రిలీజ్ | Sunny Leone QG Gang War Movie Telugu Trailer | Sakshi
Sakshi News home page

QG Movie Trailer: 'దండుపాళ్యం' లాంటి మరో సినిమా

Aug 26 2024 7:57 PM | Updated on Aug 26 2024 7:57 PM

Sunny Leone QG Gang War Movie Telugu Trailer

సన్నీ లియోన్, ప్రియమణి, జాకీష్రాఫ్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'క్యూజీ గ్యాంగ్ వార్'. ఈనెల 30న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతోంది. వివేక్ కుమార్ కన్నన్ దర్శకుడు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాతలు ప్రసన్నకుమార్, దామోదర్ ప్రసాద్ చేతుల మీదగా ఇది లాంచ్ అయింది.

(ఇదీ చదవండి: అభిమాని కుటుంబాన్ని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి)

ట్రైలర్ చూస్తుంటే ప్రధాన పాత్రధారులు ఎవరినీ గుర్తుపట్టలేం అన్నంతగా డీ గ్లామర్ లుక్‌లో కనిపించారు. అలానే విజువల్స్ చూస్తుంటే గతంలో వచ్చిన 'దండుపాళ్యం' సినిమా గుర్తొచ్చింది. మరి ఈ సినిమా కూడా అంత సెన్సేషన్ సృష్టించి హిట్ అవ్వాలని ట్రైలర్ ఆవిష్కరణకు విచ్చేసిన నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్‌ నమితకి గుడిలోకి నో ఎంట్రీ)

Advertisement
 
Advertisement
Advertisement