
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే దర్శకుడు తరచూ ఈ మూవీ నుంచి కొత్త అప్‌డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు. నేపథ్యంలో శనివారం షూటింగ్ గ్యాప్‌లో జక్కన తన హీరోలతో కాస్త సరదా సమయం గడిపిన సరదాగా వీడియోను మూవీ యూనిట్ అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్, తారక్‌లు పిట్టగోడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, ఆ దృశ్యాన్ని జక్కన్న డమ్మీ కెమెరాతో షూట్ చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే ఇందులో తారక్ కనుబొమ్మపై గాయం అయినట్లు కనిపించిన సంగతి తెలిసిందే. దీంతో అది చూసిన ఎన్టీఆర్ అభిమాను లు కాస్తా కంగారు పడ్డారు. ‘ఏమైంది అన్న, ఏం జరిగింది’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో ఆర్‌ఆర్‌ఆర్ టీం స్పందిస్తూ ఎన్టీఆర్ గాయంపై వివరణ ఇచ్చింది. ఎన్టీఆర్ కనుబొమ్మపై ఉన్నది నిజమైన గాయం కాదని షూటింగ్‌లో భాగంగా పెట్టిన గాయమని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆయన అభిమానులు కాస్తా ఊపిరి పిల్చుకున్నారు. కాగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఆగస్టు చివరి కల్లా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కానున్నట్లు సమాచారం.
ఫైనల్ షెడ్యూల్‌లో భాగంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీం ఉక్రెయిన్‌లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ టీం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మేకింగ్ వీడియాతో పాటు ఇటీవలె దోస్తీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 13న ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.
Ah debbentanna 🥺
— YugandhaRRR🌊_Tarakian (@Yuga_taRock) August 7, 2021
M aindi brother @RRRMovie ?
We want a serious explanation on this one .!😤 https://t.co/0M4FRkNf7r