100 రోజులు పూర్తి.. సెలబ్రేట్‌ చేసుకున్న ‘హను-మాన్‌’ టీమ్‌

Prasanth Varma Hanuman Movie Team Celebrates 100th Day Of Shoot - Sakshi

వినూత్న కథలతో సినిమాని  తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఆయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న సినిమా హానుమాన్‌. తేజ స‌జ్జ హీరోగా చేస్తున్న ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై  కె. నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్నాడు. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీ 100 రోజుల షూటింగ్‌ పూర్తి చేసుకుందని ఓ వీడియో ద్వారా మేకర్స్‌ ప్రకటించారు.

చాలా మంది ఈ చిత్రం కోసం కష్టపడుతున్నట్లు తెలిపారు. భారీ వీఎఫ్ఎక్స్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి  అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ లు సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అంజమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్‌ కుమార్ నటిస్తున్నారు.  తెలుగుతో పాటు   తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ  ఈ చిత్రం విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top