తెలుగమ్మాయి కోలీవుడ్‌ ఎంట్రీ.. రిలీజ్‌కు రెడీ | Poojitha Ponnada grand entry into kollywood cinema | Sakshi
Sakshi News home page

Poojitha Ponnada: తెలుగమ్మాయి కోలీవుడ్‌ ఎంట్రీ.. రిలీజ్‌కు రెడీ

Oct 13 2026 7:33 AM | Updated on Oct 13 2026 7:33 AM

Poojitha Ponnada grand entry into kollywood cinema

తెలుగింటి ఆడపడుచు పూజిత పొన్నాడ కోలీవుడ్లో తన అదృష్టాన్ని పరిక్షించుకొనుంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ 'సిగ్నల్‌ అట్‌ 11.30' చిత్రం ద్వారా కథానాయికీగా కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.ఈ మూవీకి మలర్‌ వళీ నటేశన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అలర్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంతోష్‌ ప్రతాప్‌ హీరోగా..పూజిత పొన్నాడ, భవ్య త్రికా హిరోయిన్లుగా నటించారు.

ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 30వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా సిగ్నల్‌ అట్‌ 11.30 చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం కావడం గురించి నటి పూజిత పొన్నాడ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన సినీ పయనంలో ఈ చిత్రం ముఖ్యమైన మైలు రాయిగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తాను విశాఖపట్నంలో పుట్టినా, పలు ప్రాంతాల్లో పెరిగి చదివినట్లు తెలిపారు. అలా విద్యకు ప్రాధాన్యత నిచ్చే కుటుంబంలో పెరిగిన తాను చెన్నైలో కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన తాను హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్‌ కంపెనీలో కొంత కాలం ఉద్యోగం చేసినట్లు చెప్పారు.

నాట్యం, చిత్రలేఖనంప్‌ ఆసక్తి కలిగిన తాను షార్ట్‌ ఫిలిమ్స్‌ దర్శకుడిని కలిసినప్పుడు ఆయన అనూహ్యంగా షార్ట్‌ ఫిల్మ్‌ లో నటిస్తావా? అని అడగడంతో ఓకే చెప్పానన్నారు. అలా మొదలైన తన నట పయనం తాను నటించిన పరిచయం అనే షార్ట్‌ ఫిల్మ్‌ లో నటించాలని చెప్పారు. ఆ తరువాత నటించిన యాడ్‌ ఫిల్మ్‌ చూసిన  దర్శకుడు సుకుమార్‌ ఆయన దర్శకత్వం వహించిన దర్శకుడు అనే చిత్రంలో నటించే అవకాశం కల్పించాలని చెప్పారు.ఆ తరువాత రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన రంగస్థలం చిత్రంతో పాలు పలు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించినట్లు చెప్పారు. ఇప్పుడు ఈ చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా నటి పూజిత పొన్నాడ పేర్కొన్నారు. ఈ చిత్రానికి డీ.ఇమాన్‌ సంగీతాన్ని అందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement