సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ మరోసారి ర్యాంప్‌పై దేవతలా మెరిసిపోయింది. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో కాస్మెటిక్ బ్రాండ్ లోరియల్ అక్టోబర్ 3న నిర్వహించిన ఈవెంట్‌లో వైట్ కలర్ దుస్తుల్లో ర్యాంప్ వ్యాక్ చేసి అక్కడున్నవారినందరినీ మెస్మరైజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న సెలబ్రిటీ మహిళలతో ఈఫిల్ టవర్ దగ్గర నిర్వహించిన ఈవెంట్‌లో ఐశ్యర్య రాయ్ సందడి ట్రెండింగ్‌లో నిలిచింది.

‘లే డిఫైల్ లోరియల్ పారిస్ 2021 విమెన్స్ వేర్ సమ్మర్ 2022 షో’ పారిస్‌లో ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత, వేధింపులకు వ్యతిరేకంగా ప్రచారం థీమ్‌తో ఈ ఏడాది ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్టు ఎల్ ఓరియల్ పారిస్ గ్లోబల్ బ్రాండ్ ప్రెసిడెంట్ డెల్ఫిన్ విగుయర్-హోవాస్సే ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను లోరియల్ పారిస్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

ఈఫిల్ టవర్ బ్యాక్ గ్రౌండ్‌లో ప్రముఖ యాక్టర్స్ హెలెన్ మిరెన్, కేథరీన్ లాంగ్‌ఫోర్డ్, గాయని కెమిలా కాబెల్లో, అంబర్ హర్డ్ తదితర ప్రపంచవ్యాప్త సూపర్ సూపర్ మోడల్స్ తో ఈ వేడుక జరుపుకోవడం విశేషం. ఈ ఈవెంట్ కోసం ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ , కుమార్తె ఆరాధ్యతో కలిసి గత వారమే పారిస్ వెళ్లింది. ఈ క్రమంలో అభిషేక్ ఒక వీడియోను కూడా షేర్ చేశాడు. కాగా 2018, 2019 లో ఫ్యాషన్ వీక్‌లో కూడా ఐశ్వర్య మెరిసిన సంగతి తెలిసిందే.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
When she walk around the corner looks like a diamond in the water 💧 I know this girl make me crazy this love is a natural love ❤️ #AishwaryaInParis #AishwaryaRaiBachchan #AishwaryaRai pic.twitter.com/xZwz7IuU4P
— Aishwarya Rai (@my_aishwarya) October 3, 2021

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
