Nawazuddin Siddiqui Shares Transformation Video As He Plays A Transgender Role In Haddi - Sakshi
Sakshi News home page

Nawazuddin Siddiqui: 'ఆ లుక్ కోసం మూడు గంటలు కుర్చీకే అతుక్కుపోయా'

Dec 13 2022 6:13 PM | Updated on Dec 13 2022 7:23 PM

Nawazuddin Siddiqui transformation as he plays a transgender role in Haddi - Sakshi

బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెకుతున్న చిత్రం 'హడ్డీ'. ఈ సినిమాలో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, ఆనందితా స్టూడియోస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2023లో జీ స్టూడియోస్‌లో విడుదల కానుంది.

'హడ్డీ'లో ట్రాన్స్‌జెండర్ లుక్ కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ తీవ్రంగా శ్రమించారు. దాదాపు మూడు గంటల పాటు మేకప్ కోసం కేటాయించాడు. ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్ధిఖీ న్యూ ట్రాన్స్‌జెండర్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను జీ స్టూడియోస్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ట్రాన్స్‌జెండర్‌ మేకప్ కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ తన కుర్చీకి దాదాపు మూడు గంటల పాటు అతుక్కుపోయారని వెల్లడించింది. 

నవాజుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ..'నిపుణుల సమక్షంలో నేను కుర్చీలో దాదాపు మూడు గంటలు కూర్చోవడం నా కెరీర్‌లో ఇదే మొదటిసారి. ఈ పాత్రను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి కొత్త లుక్ నాకు శక్తినిచ్చింది. దీనిపై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూసేందుకు నేను ఇక వేచి ఉండలేను' అని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement