Natural Beauty Sai Pallavi Posts Her Latest Photos on Insta Goes Viral- Sakshi
Sakshi News home page

Sai Pallavi: చీరకట్టులో సాయిపల్లవి.. ఫోటోలు చూస్తే ఫిదా కావాల్సిందే!

Sep 4 2021 1:05 PM | Updated on Sep 4 2021 2:22 PM

Natural Beauty Sai Pallavi Posts Her Latest Photos on Insta Goes Viral - Sakshi

Sai Pallavi Shared New Saree Pictures on Instagram: తన డాన్స్‌తో, నటనతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ సాయిపల్లవి. శేఖర్‌ కమ్ముల ‘ఫిదా’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ కుట్టి.. తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. కథా బలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది.  ఒక్క తెలుగులోనే కాదు.. తమిళం, మలయాళంలో కూడా నటిస్తూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో దూసుకెళ్తుంది ఈ న్యాచురల్‌ బ్యూటీ.

ఇక సినిమాల్లో ఎంతగా బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది సాయిపల్లవి. మూవీ కబుర్లతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అందులో పింక్‌ కలర్‌ చీరలో చిరనవ్వులు చిందిస్తూ కనిపించింది. ఈ ఫోటోలను సాయి పల్లవి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘అనుకోకుండా.. ఆకస్మాత్తుగా అందమైన ఫోటోలను తీయగల నైపుణ్యాలు మా చెల్లెలు సొంతం’ అంటూ తన చెల్లెలు ఫోటోగ్రఫిపై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తే నిజంగా ఎవరైనా ఫిదా కావాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement