'లవ్ రెడ్డి' మూవీ.. కైలాష్ ఖేర్ ఎమోషనల్ సాంగ్ రిలీజ్ | Love Reddy Movie Pranam Kanna Video Song | Sakshi
Sakshi News home page

'లవ్ రెడ్డి' మూవీ.. కైలాష్ ఖేర్ ఎమోషనల్ సాంగ్ రిలీజ్

Oct 9 2024 10:42 AM | Updated on Oct 9 2024 10:57 AM

Love Reddy Movie Pranam Kanna Video Song

గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'లవ్ రెడ్డి'. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. స్మరన్ రెడ్డి దర్శకుడు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్లలో రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: నోరు జారిన టేస్టీ తేజ.. వెక్కివెక్కి ఏడ్చిన నయని పావని)

ఈ సినిమాలోని 'ప్రాణం కన్నా..' అనే లిరికల్ పాటని తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ పాడిన ఈ హార్ట్ బ్రేకింగ్ ఎమోషనల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. 'ప్రాణం కన్నా ప్రేమించినా..ఆ ప్రేమనే తెంచావుగా....' అంటూ ప్రేమికుడి బాధను వ్యక్తం చేస్తూ సాగుతుందీ పాట. 'ప్రాణం కన్నా..' పాటకు 'లవ్ రెడ్డి' మూవీలో ఎంతో ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: మరో వివాదంలో నయనతార.. నిర్మాతలు ఎందుకు డబ్బులివ్వాలి?)

Advertisement
 
Advertisement
Advertisement