‘లైగర్‌’కి రికార్డు డీల్స్, డిజిటల్‌, ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరే ఆఫర్స్‌ | Liger Movie: Record Deal For Digital, Satellite Rights | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: ‘లైగర్‌’కి రికార్డు డీల్స్, డిజిటల్‌, ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరే ఆఫర్స్‌

May 3 2022 5:58 PM | Updated on May 3 2022 6:14 PM

Liger Movie: Record Deal For Digital, Satellite Rights - Sakshi

Record Deal For Digital, Audio Rights To Liger Movie: విజయ్‌ దేవరకొండ- పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా సినిమా 'లైగర్‌'. ఆగస్టు 25న ఈ చిత్రం విడుదల కానుంది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్ర చేయనుండడం విశేషం. దీంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మైక్‌ టైసన్‌ విజయ్‌ తండ్రిగా కనిపించనున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్‌కు ముందే భారీ స్థాయిలో బిజినెస్‌ చేస్తోంది.

చదవండి: లెటేస్ట్‌ అప్‌డేట్‌: ఈ నెలలోనే ఓటీటీకి ఆర్‌ఆర్‌ఆర్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్, ఆడియో రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తాజా బజ్‌ ప్రకారం.. లైగర్‌ ఆడియో హక్కులను సోనీ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వినికిడి. దీని కోసం సోనీ రూ. 14 కోట్లు చెల్లించినట్లు సమాచారం. విజయ్ కెరీర్‌లో ఇది అది పెద్దం మొత్తం అని చెప్పాలి. అలాగే ఓటీటీ హక్కులను డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ భారీ డీల్‌కు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే శాటిలైట్ హక్కులను ఇప్పటికే స్టార్ నెట్‌వర్క్ పొందిందట. ఇక త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

చదవండి: ఒక్క ఎపిసోడ్‌తో పాతాళానికి పడిపోయిన బిందు!

అయితే విజయ్‌ దేవరకొండకు ఉన్న స్టార్‌డమ్‌ని దృష్టిలో ఉంచుకొని మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నట్లు కూడా సమాచారం. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైం కళ్లు చెదిరే డీల్‌కు సొంతం చేసుకుందంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ కలిసి నిర్మించాయి.   తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను మణిశర్మ అందిస్తుండగా.. పాటలకు తనిష్క్ బాగ్చీ స్వరాలు కూర్చనున్నాడు.   

Advertisement
 
Advertisement
Advertisement