'కల్కి 2898' టైటిల్‌ సీక్రెట్‌ ఇదే: నాగ్‌ అశ్విన్‌

Kalki 2898 AD Behind The Story Of Title - Sakshi

ప్రభాస్‌ 'కల్కి 2989 ఏడీ' మూవీ గురించి నిత్యం ఏదొ ఒక వైరల్‌ న్యూస్‌ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్‌ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు.

తాజాగా నాగ్ అశ్విన్ సినాప్స్ అనే ఓ టెక్నాలజీ, మైథాలజీ ఇంటరాక్షన్ మీట్‌లో పాల్గొన్నాడు. అక్కడ కల్కి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అశ్విన్‌ పంచుకున్నాడు. మహాభారతం, స్టార్‌ వార్స్‌... రెండింటినీ చూస్తూ, వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ పుట్టిందని నాగ్‌ అశ్విన్ అన్నారు. ఈ సినిమా కూడా మహాభారతం  కాలం నుంచి మొదలయి 2898లో పూర్తవుతుంది.

అందుకే సినిమాకు ఆ టైటిల్ పెట్టడం జరిగింది. సినిమా 6000 సంవత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తుంది. సినిమాలో ప్రధానమైన పాత్రలన్నీ కూడా ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయి. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశాం. ఈ క్రమంలోనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశాం.' అని తెలిపారు. ఈ ఏడాది సమ్మర్‌లో మే 9న ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 విడుదల కానుంది.

whatsapp channel

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top