Gauahar Khan Shares Photo With Baby Bump - Sakshi
Sakshi News home page

Gauahar Khan: బేబీ బంప్‌ ఫోటో షేర్ చేసిన బిగ్ బాస్ నటి.. సోషల్ మీడియాలో వైరల్

Jan 2 2023 9:32 PM | Updated on Jan 3 2023 9:25 AM

Gauahar Khan Shares first baby bump photo Goes Viral - Sakshi

బిగ్ బాస్ నటి, విన్నర్ గౌహర్ ఖాన్ ఇటీవలే గర్భం ధరించిన సంగతి తెలిసిందే. గత నెలలోనే తన భర్త జైద్ దర్బార్ తో కలిసి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ సమయంలో ఓ వీడియోను విడుదల చేసిన నటి తాజాగా బేబీ బంప్ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. గోవాలోని ఓ రిసార్ట్ లో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది బాలీవుడ్ భామ. 

గత నెలలో గౌహర్, భర్త జైద్ దర్బార్ సోషల్ మీడియాలో గర్భం దాల్చినట్లు ప్రకటించారు. వీరు డిసెంబర్ 2020లో ఘనంగా వివాహం చేసుకున్నారు. జైద్ ప్రముఖ సంగీత స్వరకర్త ఇస్మాయిల్ దర్బార్ కుమారుడు జైద్ దర్బార్. ఇటీవల బిగ్ బాస్ బ్యూటీ గౌహర్ మాట్లాడుతూ.. "జైద్, నేను ఉత్సాహంగా ఉన్నాం. నేను కొన్ని విషయాలను సాధ్యమైనంత తక్కువగా చెప్పాలనుకుంటున్నా. ఇది మా ఇద్దరికీ పూర్తిగా కొత్త ప్రయాణం. నేను ఎలా ఫీల్ అవుతున్నానో మాటల్లో చెప్పలేను. ఈ సందర్భంలో మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం.' అని అన్నారు. 

కాగా.. గౌహర్ ఖాన్ రాకెట్ సింగ్:సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్, ఇష్క్ ‌జాదే, బేగం జాన్, పొలిటికల్ వెబ్ సిరీస్ తాండవ్ తో పాటు అనేక చిత్రాలలో నటించారు. ఆమె బిగ్ బాస్ సీజన్- 7 టైటిల్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఆమె శిక్షా మండల్ అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో కనిపించింది. జూన్ 2022లో విడుదలైన సాల్ట్ సిటీలో కూడా ఆమె కనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement