Dear KTR Sir Anasuya Bharadwaj Tweet Viral - Sakshi
Sakshi News home page

డియర్‌ కేటీఆర్‌ సర్‌ అంటూ అనసూయ ట్వీట్‌.. వైరల్‌

Oct 29 2021 1:52 PM | Updated on Oct 29 2021 3:39 PM

Dear KTR Sir Anasuya Bharadwaj Tweet Viral - Sakshi

బుల్లితెరపై క్రేజ్‌ ఉన్న యాంకర్స్‌లో ఒకరు అనసూయ భరద్వాజ్‌. తన అందచందాలతో ఫ్యాన్స్‌ మనసులను దోచేసిన ఈ బ్యూటీ, అనంతరం నటిగానూ వెండితెరపై రాణిస్తోంది. అయితే ఈ భామ సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ.. వ్యక్తిగత, వృత్తిగత విషయాలతో పాటు వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని తెలుపుతుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఈమె స్కూల్స్‌ పునః ప్రారంభం గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

ఆ ట్వీట్‌లో..‘డియర్‌ కేటీఆర్‌ సర్‌.. ఎందుకు లాక్‌డౌన్‌ చేశారో.. ఎందుకు తీసేశారో అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్లందరూ వ్యాక్సిన్‌ వేసుకున్నారని భరోసా ఇవ్వొచ్చు.. కానీ పిల్లల పరిస్థితి ఏంటి సర్‌?.. స్కూల్‌లో ఉన్నప్పుడు పిల్లలకు ఏమైనా జరిగితే వారు బాధ్యులు కారని సంతకం చేసిన పేపర్‌ పంపమని పాఠశాలలు ఎందుకు బలవంతం చేస్తున్నాయి.. చెప్పండి సర్‌.. ఇది ఎంతవరకు న్యాయం.. మీరు మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చింది.

చదవండి: అనసూయ ఎంట్రీ.. షో నిర్వాహకులకి షాకిచ్చిన తమన్నా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement