అదిరిపోయే తెలుగు డైలాగ్స్‌తో 'డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్' ట్రైలర్‌ | Deadpool And Wolverine Telugu Trailer viral | Sakshi
Sakshi News home page

అదిరిపోయే తెలుగు డైలాగ్స్‌తో 'డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్' ట్రైలర్‌

Jul 22 2024 1:46 PM | Updated on Jul 22 2024 1:46 PM

Deadpool And Wolverine Telugu Trailer viral

హాలీవుడ్‌ నుంచి మార్వెల్ మూవీ యూనీవ‌ర్స్‌లో మ‌రో కొత్త సినిమా ఫ్యాన్స్‌ను ఉర్రూత‌లుగించేందుకు రెడీ అయింది. 'డెడ్ పుల్' మూవీ ఫ్రాంఛైజ్ నుంచి మూడో సినిమాగా 'డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్' సినిమా ఈ జూలై 26న విడుద‌ల‌ కానుంది. ఈ సినిమాలో సూప‌ర్ హీరో డెడ్ పుల్‌తో పాటు మిలీనియ‌మ్ సూప‌ర్ హీరో ఎక్స్ మెన్‌లో మోస్ట్ ఫెవ‌రేట్ వాల్వ‌రిన్ కూడా సిల్వ‌ర్ స్రీన్‌పై ఫైట్లు చేయ‌బోతున్నాడు. దీంతో ఒకేసారి ఇద్ద‌రు హీరోలు చేయ‌బోయే అద్భుత‌మైన విన్యాసాల‌ను మూవీ ల‌వ‌ర్స్ డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్ ద్వారా వీక్షించ‌బోతున్నారు. 

ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్స్ కు వ‌రల్డ్ వైడ్ విప‌రీతంగా క్రేజ్ ఏర్ప‌డింది, ఈ నేప‌థ్యంలో మార్వెల్ టీమ్ ఈ సినిమాను అన్ని భాష‌ల్లో ఉన్న సినీ అభిమానుల‌ను మ‌రింత అల‌రించే విధంగా తీర్చిదిద్దేందుకు డ‌బ్బింగ్ వెర్ష‌న్స్ ను సిద్ధం చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా డ‌బ్బింగ్ ఫ్యాన్స్‌ను అత్యంత ఆకట్టుకుంద‌నే విష‌యం తెలుగు ట్రైల‌ర్ చూస్తే అర్ధం అవుతుంది. తెలుగులో ఉన్న ట్రెండింగ్ ప‌దాల‌ను, యూత్ మ‌ధ్య విప‌రీతంగా వినిపించే ప‌దాల‌తో ఉన్న డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్ అవ్వ‌నున్నాయి. 

తెలుగు సినీ అభిమానులు ఇటీవ‌ల ఇష్ట‌ప‌డిన కుర్చీమ‌డ‌త‌పెట్టి, కెవ్వుకేక‌, రింగ రింగ ఇలా అనేక అన్‌లైన్ ట్రెండింగ్ కీ వ‌ర్డ్స్‌తో డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్ తెలుగు వెర్ష‌న్ సిద్ధం అయింది. ఈ చిత్రంలో వాల్వ‌రిన్‌గా హుయ్ జాక్ మెన్, డెడ్ పుల్‌గా ర‌య‌న్ రెనాల్డ్స్ క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జూలై 26న ఈ సినిమా భారీ స్థాయిలో విడుద‌ల అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement