ఇద్ద‌రు సూప‌ర్ హీరోల సినిమా.. విడుదల ఎప్పుడంటే | Deadpool & Wolverine Movie Release Date Confirmed | Sakshi
Sakshi News home page

ఇద్ద‌రు సూప‌ర్ హీరోల సినిమా.. విడుదల ఎప్పుడంటే

Jul 15 2024 4:26 PM | Updated on Jul 15 2024 4:42 PM

Deadpool & Wolverine Movie Release Date Confirmed

హాలీవుడ్‌ నుంచి మార్వెల్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ సినిమాల్లో క‌నిపించే సూప‌ర్ హీరోలు వెండితెరపై కనిపిస్తే  సంబ‌రాల్లో మునిగితేలుతుంటారు. ఈ క్రమంలో మార్వెల్ యూనీవ‌ర్స్ నుంచి డెడ్ పుల్ సిరీస్‌లో భాగంగా జూలై 26న డెడ్ పుల్ & వాల్వరిన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైల‌ర్ యూట్యూబ్‌లో మిలియ‌న్స్ కొద్దీ వ్యూస్ అందుకోవ‌డంతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది. 

ఈసారి డెడ్ పుల్‌తో పాటు వాల్వ‌రిన్ కూడా వెండితెరపై అద్భుత విన్యాసాలు చేయ‌బోతున్నాడు. ఇద్ద‌రు సూప‌ర్ హీరోలు ఒకేసారి అభిమానులు ముందుకు రానున్న నేప‌థ్యంలో డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్ మోస్ట్ ఫెవ‌రేట్ మార్వెల్ మూవీగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ రీత్య హైద‌ర‌బాద్‌లో మార్వెల్ సినిమాలు అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. 

ఇటీవ‌లే డెడ్ పుల్ & వాల్వ‌రిన్ టికెట్లు బుకింగ్ మొద‌లైన సంద‌ర్భంగా త‌మ అభిమానాన్ని పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. ఈ సెల‌బ్రేష‌న్ వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  డెడ్ పుల్ & వాల్వ‌రిన్‌లో ప్ర‌ధాన‌పాత్ర‌ధారులుగా ర‌య‌న్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ న‌టిస్తున్నారు. జూలై 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement