బిగ్‌బాస్‌లో హౌస్‌ఫుల్ అనే మాట న‌చ్చ‌దు: క‌మ‌ల్

Bigg Boss 4 Telugu:  Kamal Haasan And BB Tamil 4 Contestants To make A Cameo - Sakshi

నేడు(శ‌నివారం) సౌత్ ఇండియా స్టార్, విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ పుట్టిన రోజు. ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, కొరి‌యోగ్రాఫ‌ర్‌, రాజ‌కీయ న‌టుడు అయిన క‌మ‌ల్ త‌మిళ‌ బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కు వ్యాఖ్యాత కూడా! తెలుగు బిగ్‌బాస్ క‌న్నా ఆల‌స్యంగా త‌మిళ బిగ్‌బాస్‌ అక్టోబ‌ర్ 5న ప్రారంభ‌మైంది. అంటే కేవ‌లం నెల రోజులు జ‌ర్నీ మాత్ర‌మే పూర్త‌వ‌డంతో అక్క‌డి హౌస్ కంటెస్టెంట్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఇంత‌కీ ఆ గొడ‌వంతా ఇప్పుడెందుకు అంటారా? మ‌రేం లేదు, నేడు తెలుగు బిగ్‌బాస్‌తో పాటు త‌మిళ బిగ్‌బాస్‌ను కూడా మీరు ఒకేసారి వీక్షించ‌బోతున్నారు.

లోక‌నాయ‌కుడి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్పెష‌ల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కంటెస్టెంట్ల‌తో స‌హా క‌మ‌ల్ హాస‌న్‌ నేడు తెలుగు సీజ‌న్‌కు వ‌చ్చేశారు, అదీ వ‌ర్చువ‌ల్‌గా! ఆయ‌న‌ను చూసి స‌ర్‌ప్రైజ్ అయిన‌ ఇంటిస‌భ్యులు ఆనందంతో గెంతులేశారు. ఇక‌ క‌మ‌ల్ తెలుగులో, నాగార్జున త‌మిళంలో ప‌ల‌క‌రించ‌డం కొస‌మెరుపు. ఈ సంద‌ర్భంగా నాగార్జున మాట్లాడితే మీ హౌస్‌ఫుల్ అయింది సార్ అని చెప్పుకొచ్చారు. దీనికి క‌మ‌ల్ స్పందిస్తూ హౌస్‌ఫుల్ అనేది నాకు న‌చ్చ‌ని మాట అంటూ న‌వ్వేశారు. మ‌రి ఇద్ద‌రు స్టార్లు, రెండు భాష‌ల కంటెస్టెంట్లు ఒక్క‌ట‌యితే ఆ సంద‌డి ఎలా ఉంటుందో చూడాలంటే మ‌రికొద్ది గంట‌లు వేచి చూడాల్సిందే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top