కొత్త సినిమా ప్రకటించిన ఆనంద్‌ దేవరకొండ | Anand Devarakonda Next Movie Titled As Gam Gam Ganesha | Sakshi
Sakshi News home page

Anand Devarakonda: కొత్త సినిమా ప్రకటించిన ఆనంద్‌ దేవరకొండ

Feb 7 2022 1:34 PM | Updated on Feb 7 2022 2:30 PM

Anand Devarakonda Next Movie Titled As Gam Gam Ganesha - Sakshi

సెలక్టివ్‌గా కథలు ఎంచుకుంటున్న ఆనంద్‌.. తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించాడు. గంగం గణేశా టైటిల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశాడు...

దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. తర్వాత సెలక్టివ్‌గా కథలు ఎంచుకుంటున్న ఆనంద్‌.. తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించాడు.

గంగం గణేశా టైటిల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశాడు. ఈ మూవీకి ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. కేదార్‌ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చైతన్య భరద్వాజ్‌ సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తామని, అప్పుడు మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement