
Pushpa Release Date: ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా చేయక ముందు ఆగస్టు 13న రిలీజ్ చేయాలనుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది.
ఇప్పుడు తొలి భాగాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది. అయితే ఈ ఏడాది డిసెంబరులోనే విడుదల చేయాలనుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రెండో భాగాన్ని వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారని తెలిసింది.