రెండోసారి ప్రెగ్నెంట్‌? వీడియోతో క్లారిటీ వచ్చినట్లే! | Alia Bhatt puts End to Second Pregnancy Rumours | Sakshi
Sakshi News home page

Alia Bhatt: రెండోసారి గర్భం దాల్చిన హీరోయిన్‌.. నిజమేనా?

Jun 21 2025 7:10 PM | Updated on Jun 21 2025 7:51 PM

Alia Bhatt puts End to Second Pregnancy Rumours

బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ (Alia Bhatt) మరోసారి గర్భం దాల్చిందని కొన్ని వారాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఆలియా హాజరైనప్పటి నుంచి ఈ రూమర్స్‌ మొదలయ్యాయి. పైగా జిమ్‌కు వెళ్లినప్పుడు కూడా కెమెరాలు కనిపించగానే ఎవరినీ పలకరించకుండా హడావుడిగా వెళ్లి కారులో కూర్చునేది. దీంతో నిజంగానే ఆలియా ప్రెగ్నెంట్‌ అయిందేమోనన్న అనుమానాలు వెలువత్తాయి. 

డ్యాన్స్‌ రిహార్సల్స్‌..
కానీ, హీరోయిన్‌ లేటెస్ట్‌ వీడియోతో ఇవన్నీ వుట్టి పుకార్లేనని తేలిపోయాయి. ఆల్ఫా సినిమా కోసం డ్యాన్స్‌ రిహార్సల్స్‌ చేసిన ఆలియా తాపీగా వెళ్లి కారెక్కింది. మధ్యలో అక్కడున్నవారిని కూడా పలకరించింది. పైగా తనకు పొట్ట కూడా లేకపోవడంతో సెకండ్‌ ప్రెగ్నెన్సీ అంటూ వస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. 

రాహా మూడో బర్త్‌డే..
ఆలియా భట్‌ - రణ్‌బీర్‌ కపూర్‌ 2022లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది కూతురు రాహా జన్మించింది. ఈ ఏడాది రాహా మూడో బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకోనుంది. సినిమాల విషయానికి వస్తే ఆలియా ప్రస్తుతం 'ఆల్ఫా' మూవీ చేస్తోంది. 'ముంజ్య' హీరోయిన్‌ శార్వరితో కలిసి నటిస్తున్న ఈ మూవీ క్రిస్‌మస్‌కు విడుదల కానుంది.

 

 

చదవండి: నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్‌ వార్నింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement