Rakhi Sawant Arrest: గర్భం దాల్చిన నటి రాఖీ సావంత్‌? అంతలోనే అరెస్ట్‌

Actress Rakhi Sawant Arrested Over Sherlyn Chopra Complaint - Sakshi

బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని మరో బాలీవుడ్‌ నటి షెర్లిన్‌ చోప్రా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేస్తూ తనపై అభ్యంతరకర భాష వాడినందుకు గానూ పోలీసులు రాఖీని అరెస్ట్‌ చేశారని ఆమె పేర్కొంది. ‘‘అంబోలి పోలీసులు ఎఫ్‌ఐఆర్ 883/2022కి సంబంధించి రాఖీ సావంత్‌ను అరెస్టు చేశారు. నిన్న రాఖీ సావంత్ ఏబీఏ 1870/2022ను(ముందస్తు బైయిల్‌) ముంబై సెషన్ కోర్టు తిరస్కరించింది’’ అని షెర్లిన్ చోప్రా ట్విట్టర్‌లో పేర్కొంది.  

చదవండి: ప్రముఖ నటుడు, కమెడియన్‌ వడివేలు ఇంట విషాదం

కాగా గతేడాది రాఖీ సావంత్‌, షెర్లిన్‌ చోప్రా మధ్య పెద్ద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు మాటల యుద్దం చేసుకున్నారు. మీటు వివాదంలో బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్‌పై షెర్లిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు అతడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే అతడికి రాఖీ మద్దతు తెలుపుతూ షెర్లిన్‌ను దూషించింది. దీంతో ఒకరిపై ఒకరు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంబోలి, ఓషివారా పోలీస్ స్టేషన్లలో రాఖీపై షెర్లిన్‌ ఫిర్యాదు చేసింది. 

చదవండి: శృతి హాసన్‌కు ఐ లవ్‌ యూ చెప్పడంపై గోపిచంద్‌ మలినేని వివరణ

తన వీడియో లింక్‌లు, ఫోటోలను సోషల్ మీడియాలో ప్రసారం చేశారనే ఆరోపణలపై నటి షెర్లిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటి రాఖీ సావంత్‌ను అరెస్ట్‌ చేశామని పోలీసు అధికారిక తెలిపారు. అలాగే తనపై ఐపీసీలో సెక్షన్లు 354ఏ, 509, 504తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సంబంధిత నిబంధనల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైనట్టుగా చెప్పారు. అంబోలి పోలీసు బృందం గురువారం సావంత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే ప్రియుడి అదిల్‌ ఖాన్‌ గతేడాది సీక్రెట్‌ పెళ్లి చేసుకున్న రాఖీ ప్రస్తుతం గర్భవతిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top