ప్రజల భద్రత కోసమే కార్డన్‌సెర్చ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజల భద్రత కోసమే కార్డన్‌సెర్చ్‌

Jul 6 2025 7:11 AM | Updated on Jul 6 2025 7:11 AM

ప్రజల

ప్రజల భద్రత కోసమే కార్డన్‌సెర్చ్‌

మంచిర్యాలక్రైం: ప్రజల భద్రత కోసమే కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు ఏసీపీ ఆర్‌.ప్రకాశ్‌ తెలిపారు. జిల్లాకేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో శనివారం రాత్రి కార్డన్‌సెర్చ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంబర్‌ ప్లేట్‌ లేకుండా ఎలాంటి పత్రాలు లేని 30 బైక్‌లు, బెల్ట్‌ షాపుల వద్ద నుంచి సుమారు రూ.10 వేల విలువ గల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడు తూ జిల్లాలో చట్టవ్యతిర్జే కార్యకలాపాలకు పాల్ప డితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్జీయూకేటీలో కౌన్సెలింగ్‌ ఏర్పాట్లపై సమీక్ష

బాసర: ఆర్జీయూకేటీలో అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ఏర్పాట్లపై అధికారులతో ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్‌ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాసర, మహబూబ్‌నగర్‌ కేంద్రాల్లో ఈనెల 7, 8, 9 తేదీల్లో అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కోసం కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అడ్మిషన్ల కన్వీనర్‌ చంద్రశేఖర్‌, కోకన్వీనర్‌ దేవరాజు, బండి హరికృష్ణ, అడ్వైజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రజల భద్రత కోసమే కార్డన్‌సెర్చ్‌1
1/1

ప్రజల భద్రత కోసమే కార్డన్‌సెర్చ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement