
మరిన్ని కొత్త బడులు
● 20 మంది విద్యార్థులుంటే చాలు.. ● మంచిర్యాలలో 15, నిర్మల్‌లో ఐదు స్కూళ్ల ప్రారంభానికి సన్నాహాలు ● అద్దెభవనాల్లో ఏర్పాటుకు చర్యలు
మంచిర్యాలఅర్బన్: నిరుపేద విద్యార్థులకు సర్కా రు విద్యను చేరువ చేసేందుకు ప్రభుత్వం దృష్టి సా రిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, మంచిర్యాలలో కొత్తగా పాఠశాలలు ప్రారంభించేందుకు నిర్ణయించింది. 20 మంది, అంతకంటే ఎక్కు వ పిల్లలున్న ప్రాంతాలను గుర్తించి పాఠశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీనిపై శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే విద్యార్థులు లేరంటూ మూసేసిన పాఠశాలల పునఃప్రారంభానికి విద్యాశా ఖ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఇప్పటికే మంచి ర్యాల జిల్లాలో మూడు పాఠశాలలు పునఃప్రారంభించింది. హజీపూర్ మండలం వెంపల్లి, లక్సెట్టిపే ట్ మండలం కొత్త కొమ్ముగూడ, దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లిలో పాఠశాలలు తెరుచుకున్నాయి. ‘ప్రైవేట్’కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్యను సర్కారు అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలో 23పాఠశాలల్లో పూర్వప్రాథమిక విద్యను అం దుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం విద్యార్థులుండి బ డులు లేని చోట వెంటనే కొత్తగా ప్రైమరీ స్కూళ్ల ఏ ర్పాటే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లాలో 5, మంచిర్యాలలో 15 కొత్త బడులు త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం ఆయా జిల్లా ల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఏర్పాట్లలో అధికారులు
గ్రామీణ, పట్టణ ప్రాంతాలవారీగా కొత్త ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటుపై విద్యాశాఖ అధికారులు తలమునకలయ్యారు. కిలోమీటరు లోపు ప్రైమరీ, మూడు కిలోమీటర్ల లోపు అప్పర్ ప్రైమరీ, ఐదు కి లోమీటర్లలోపు హైస్కూల్ ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఎంత మంది పిల్లలున్నారు? పాఠశాల తెరిచే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి? అనే విషయాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. ఇందులో భాగంగా కొత్తగా సర్కారు పాఠశాలలకు అవసరమైన వసతిగృహా లు, అద్దె భవనాలు ఎక్కడెక్కడా ఉన్నాయో.. ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ భవనాలు ఏమైనా ఉన్నా యా.. అని పరిశీలిస్తున్నారు. ఫర్నిచర్ బోర్డులు, వి ద్యా సామగ్రి కోసం అవసరమైన బడ్జెట్ కలెక్టర్ ద్వారా సమకూర్చనున్నారు. కొత్త పాఠశాలలు గ్రా మీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రారంభం కానున్నాయి. వీటికి అనువైన భవనాలు దొరుకుతాయా? లేదా? తేలాల్సి ఉంది.
త్వరలోనే కొత్త పాఠశాలలు ప్రారంభిస్తాం
కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి. విద్యార్థులుండి ప్రభుత్వ పాఠశాలలు లేని చోట కొత్త బడులు ఏర్పాటు కానున్నాయి. పాఠశాలలకు అనుకూలమైన భవనాలు, మౌలిక వసతులు సమకూర్చడంపై దృష్టి సారించాం. వీలైనంత త్వరలోనే కొత్త బడులు ప్రారంభం కానున్నాయి. ఇదివరకు పిల్లలు తక్కువగా ఉండి.. టీచర్లు ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి కొత్త పాఠశాలలకు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపిస్తాం.
– యాదయ్య, మంచిర్యాల డీఈవో
కొత్తవి ఇక్కడే..
20 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్నా ప్రభు త్వ, స్థానిక సంస్థల పాఠశాలలు అందుబాటులో లేని గ్రామీణ ఆవాసాలు, పట్టణ ప్రాంతా ల్లో వార్డుల జాబితాను విద్యాశాఖ అధికారులు రూపొందించారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 20 చోట్ల పాఠశాలలు ఏ ర్పాటు కానున్నాయి. మంచిర్యాల జిల్లాలో 15 చోట్ల ప్రారంభించనున్నారు. ఇందులో బెల్లంపల్లి మండలం సోమగూడెం, క్యాతన్‌పల్లిలోని వార్డు నంబర్–17 (‘బీ’ జోన్ పార్ట్), శ్రీనివాసనగర్, శేషుపల్లి విలేజీ, నాగార్జున కాలనీ క్వార్టర్, కాకతీయ కాలనీ, నస్పూర్‌లోని సుభాష్‌నగర్, హౌసింగ్‌బోర్డు కాలనీ, లక్సెట్టిపేట్‌లోని గో దావరి రోడ్ వీకర్ సెక్షన్, గొల్లగూడ మోదేల, మందమర్రి మండలంలోని బురదగూడెం, పా కిస్తాన్‌క్యాంపు, మంచిర్యాలలోని హైటెక్‌సిటీ కా లనీ, ఎల్‌ఐసీ కాలనీ, గోసేవా మండల్‌లో 20 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్నట్లు గుర్తించి పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యా రు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగాల్‌పేట్ మహాలక్ష్మీవాడ–1, డబుల్‌బెడ్‌రూం (ఎల్లపల్లి), ఖానాపూర్ డబుల్ బెడ్‌రూం కాలనీ (కుమురంభీం ఎక్స్‌రోడ్), భైంసాలోని బాబ్లాగామ్, ఖానా పూర్‌లోని రంగపేట్ గ్రామంలో అధికారులు కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు.