
విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): విద్యార్థులు చట్టాలపై కూడా అవగాహన పెంచుకోవాలని లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా చీఫ్ లీగల్ ఎ యిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎండీ సంధాని తెలి పా రు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు భారత న్యాయ సంహిత చట్టాలపై అవగాహన సద స్సు నిర్వహించారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ సూపరింటెండెంట్ భాస్కర్, డెప్యూటీ చీఫ్ శ్రీనివాస్, అసిస్టెంట్లు రాములు, సదయ్య, కళాశాల ప్రిన్సిపల్ మోహన్, వైస్ ప్రిన్సిపల్ మహేశ్వర్‌రావు, అధ్యాపకులు డాక్టర్ నగేశ్, ప్రమోద్, సంతోష్‌గౌడ్, కిరణ్, సంధ్య, ఉదయశ్రీ, శృతి, శరణ్య, సత్యనారాయణ, శ్రీనివాస్, వినయ్, సురేందర్ పాల్గొన్నారు.