
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నస్పూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రా మీణ బ్యాంక్ మంచిర్యాల ఆర్‌ఎం ప్రభుదాస్ సూచించారు. పట్టణ పరిధిలోని మెప్మా కా ర్యాలయంలో సీతారాంపల్లి, సింగాపూర్ శా ఖలు, మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల కు రుణాల మంజూరు, ఖాతాల నిర్వహణపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఈ రెండు శాఖల పరిధిలో ఇప్పటివరకు రూ.48కోట్ల రుణాలు మంజూ రు చేసినట్లు చెప్పారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ప్రతీ ఏడాది రూ.20 చెల్లించి రూ.2లక్షల ప్రమాదబీమా, రూ.436 చెల్లించి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా ద్వారా సాధారణ మరణానికి రూ.2 లక్షల బీమా సదుపాయం పొందవచ్చని తెలిపారు. మేనేజర్లు నరసింహస్వామి, రాము, ఫీల్డ్ అధికారులు రవి, డేవిడ్ పాల్గొన్నారు.