
త్యాగానికి ప్రతీక మొహర్రం
● వెల్లివిరుస్తున్న మత సామరస్యం ● జిల్లాలో నేడు మొహర్రం పండుగ
నెన్నెల: మహ్మద్ ప్రవక్త మనుమడు హజరత్ ఇమా మ్ హుస్సేన్ త్యాగానికి ప్రతీకగా ముస్లింలు మొహర్రం పండుగ జరుపుకొంటారు. ఇమామ్ హుస్సేన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ పది రో జులపాటు నివాళులర్పిస్తారు. మొహర్రం ఉత్సవా ల్లో కులమతాలకు అతీతంగా పాల్గొంటారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పీరీలను కొలుస్తారు. ప ది రోజుల పాటు పూజలందుకున్న పీరీలను మొహర్రం సందర్భంగా నేడు నిమజ్జనం చేయనున్నారు. హస్సేన్, హుస్సేన్ పేరిట గ్రామాల్లో కొలువుదీరే సవార్లను (పీరీలు) భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. పీరీల వద్ద కోరుకున్న మొక్కులు తీరుతాయని ప్రజల ప్ర గాఢ నమ్మకం. పీరీల మొక్కుతో పిల్లలు పుడితే ము స్లింలు వారికి హస్సేన్, హుస్సేన్ అని పేరు పెడతా రు. హిందువులైతే ఆశన్న, ఉశన్న, ఆడపిల్లలైతే ఆశ క్క, ఉశక్క అని నామకరణం చేస్తారని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి పేర్లు కలిగిన వారు గ్రామాల్లో చాలా మంది ఉన్నారు. పదిరోజులపా టు నిర్వహించే ఈ ఉత్సవాల్లో తారతమ్య భేదాలు లేకుండా పాల్గొంటారు. పీరీలను నమ్మేవారు మొ హర్రం నెల వంక కనిపించిన నుంచి నిమజ్జనం జరి గే వరకు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. పీరీలకు మలిద ముద్దలు, కుడుకలు, బెల్లంషరబత్ నైవేద్యంగా సమర్పిస్తారు. సబ్జా ఆకులు, పూలు, కుడుకల దండలతో అలంకరిస్తారు. పీరీల వద్ద అగ్నిగుండం (అలావా) ఏర్పాటు చేసి దాని చుట్టూ కాళ్లకు గజ్జెలు కట్టుకుని డప్పుచప్పుళ్ల మధ్య లయబద్ధంగా అసైదులా ఆడతారు.