
విధులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● కలెక్టర్ కుమార్ దీపక్ ● కార్యాలయాల తనిఖీ
మంచిర్యాలఅగ్రికల్చర్: విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. శనివారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని వివి ధ శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చే శారు. రిజిస్టర్లు, రికార్డులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హాజరు పట్టికలు, ఆయా కార్యాలయాల పరిధిలో కొనసాగుతున్న పనుల వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. ఆలస్యంగా వచ్చిన, సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన అధికారులు, సిబ్బందికి షోకా జ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్‌ను ఆదేశించారు. అధికారులు ఆయా కార్యాల యాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
ఈవీఎంల గోదాం పరిశీలన
జిల్లాలోని నస్పూర్‌లోగల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాంను కలెక్టర్ కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. గోదాం వద్ద పటిష్ట భద్రత చేపట్టినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.