
విద్యుత్ ప్రమాదాలపై అవగాహన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలంలోని దొనబండలో శనివారం విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించి రై తులకు అవగాహన కల్పించారు. ఎస్‌ఈ ఉత్తమ్ జా డే మాట్లాడుతూ.. రైతులు వానాకాలంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సొంతంగా విద్యు త్ పనులు చేయవద్దని, ఎక్కడైనా వేలాడుతున్న, తెగిపడిన తీగలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. జీఐ వైర్‌పై బట్టలు ఆరవేయరాదని, మేతకు వెళ్లే పశువులు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల వైపు వెళ్లకుండా చూడాలని సూచించారు. పొలాల వద్ద మోటర్లు, స్టార్టర్లు, జీఐ పైపులున్న ప్రాంతాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విద్యుత్ సమస్యలు ఉత్పన్నమైతే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని సూచించా రు. పొలంబాటలో రైతులు అనుమానాలను నివృత్తి చేస్తూ పొలాల్లో వంగి ఉన్న విద్యుత్ స్తంభాలను సరి చేయించారు. కార్యక్రమంలో ఆపరేషన్ డీఈ మహ్మద్ కై సర్, ఏఈ మహేందర్‌రెడ్డి, లైన్‌మెన్‌లు, రైతులు, స్థానికులు పాల్గొన్నారు.