
చోరీ చేసిన బంగారు గొలుసు విక్రయిస్తూ..
నిర్మల్‌టౌన్: చోరీ చేసిన బంగారు గొలుసు విక్రయించేందుకు వెళ్తున్న ఇద్దరు మహిళల ను అరెస్టు చేసినట్లు నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ వివరాలు వెల్లడించా రు. గతనెల 30న నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద కడెంకు చెందిన కిష్టమ్మ మెడలో రెండు తు లాల బంగారుగొలుసు చోరీకి గురైంది. పోలీ సులు బస్టాండ్ వద్ద గల సీసీ ఫుటేజీలను పరి శీలించి దొంగలు ఆదిలాబాద్‌కు చెందిన సంగింటి లక్ష్మి, నిర్మల్‌కు చెందిన పండెన కవిత గుర్తించారు. చోరీ చేసిన బంగారాన్ని విక్రయించేందుకు ఇద్దరు మహిళలు వెళ్తున్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రెండు తులాల బంగారు గొలుసు, కత్తెరను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చిన పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై సంజీవ్, జిల్లా సీసీఎస్ టీమ్‌ను ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు.