
సెల్ఫీ కొట్టు..ప్రైజ్ పట్టు
మంచిర్యాలఅర్బన్: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏటా విద్యార్థులకు జాతీయ విద్యార్థుల పర్యావరణ పోటీ (ఎన్‌ఎస్‌పీసీ)ని నిర్వహిస్తోంది. హరిత్–ద వే ఆప్ లైఫ్ అనే థీమ్‌తో దేశవ్యాప్తంగా విద్యార్థుల కు పోటీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 1న ప్రారంభమైన పోటీలు 21 వరకు కొనసాగనున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం, వ్యర్థాలు వేరు చేయడం, వాతావరణంలో పొంచి ఉన్న ప్రమాదాలను లోతుగా అర్థం చేసుకునేందు కు విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు దీని ప్రధాన ఉద్దేశం. జిల్లాలో అన్ని పాఠశాలల యాజ మాన్యాలు గత నాలుగు రోజులుగా విద్యార్థులు ప్రధానంగా మొక్కలు నాటడం, వ్యర్థాలను వేరు చేయడం, నీటి సంరక్షణ అంశాలకు సంబంధించి స్వీయచిత్రాలు (సెల్ఫీ దిగి) యాప్‌లో ఉత్సాహంగా అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ క్విజ్ పోటీల్లో పాల్గొనే విద్యార్థులందరూ ఇ–సర్టిఫికెట్లు అందుకుంటున్నా రు. జాతీయస్థాయిలో క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపి న వారికి నగదు పారితోషికంతోపాటు జాతీయ హరిత విద్యార్థి అవార్డు అర్హత పొందవచ్చు.
ఒకటో తరగతి నుంచి..
ఈ పోటీల్లో ఒకటి నుంచి పరిశోధన విద్యార్థుల వరకు ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఏకో మిత్రం యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్, ఇతర భాషల్లో క్విజ్ ఉంటుంది. మొక్క నాటుతున్న నీరు పొదుపు చేస్తున్న వ్యర్థాలను వేరు చేస్తున్న సెల్ఫీ లోడ్ చేయాల్సి ఉంటుంది. 1 నుంచి 5వ తరగతి వరకు, 6 నుంచి 8 వరకు, మూడో గ్రూప్‌లో 9 నుంచి 12వ తరగతి, నాలుగో గ్రూప్‌లో గ్రాడ్యుయేట్, పీజీ పరిశోధకులు, ఐదో గ్రూప్‌లో ఇతరులకు అవకాశం కల్పించారు. ఈనెల 21 వరకు పోటీలు నిర్వహిస్తారు. ఆగస్టు 30న ఫలితాలు వెల్లడించనున్నారు.
పర్యావరణంపై ఏకోమిత్రం పోటీలు
జూలై 21 వరకు పోటీల నిర్వహణ
ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు
విద్యార్థులను ప్రోత్సహించాలి
ప్రతీ పాఠశాల విద్యార్థులు పర్యావరణ ఏకోమిత్రం పోటీల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఈపోటీల్లో పాల్గొనేవారికి ఇ–సర్టిఫికెట్ల ఇవ్వడంతోపాటు విద్యాసంస్థలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కలుగుతుంది.
– యాదయ్య, డీఈవో

సెల్ఫీ కొట్టు..ప్రైజ్ పట్టు