
12నుంచి సకల కళల సంబరాల జాతర
బెల్లంపల్లి: ఈ నెల 12, 13వ తేదీల్లో వరంగల్‌లో సకల కళల సంబరాల జాతర నిర్వహించనున్నట్లు రాష్ట్ర జానపద కళాకారుల సంఘం కార్యదర్శి హన్మాండ్ల మధు తెలిపారు. గురువారం ఆయన బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతర పోస్టర్లను మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కారుకూరి రాంచందర్, కాంగ్రెస్ నాయకులు, కళాకారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో 1,116 మంది కళాకారులతో 30 గంటలపాటు ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం నిర్వహిస్తున్న జాతరను కళాకారులు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు జాడాల శివ, ప్రధాన కార్యదర్శి పీఆర్ ప్రసాద్, జిల్లా నృత్య కళా సమాఖ్య సభ్యులు ఆర్.అర్జున్, రమేష్, గిరి లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం పట్టణ అధ్యక్షుడు జంజర్ల దినేష్‌కుమార్, కళాకారులు అర్చన, రాంచందర్, సకినాల రాజేశ్వరరావు, బాలకృష్ణ, రాములు తదితరులు పాల్గొన్నారు.