
నీటి వనరులపై శిక్షణ
మంచిర్యాలఅగ్రికల్చర్: 7వ చిన్న తరహా, 2వ నీటి వనరుల గణనపై మండల ప్రణాళిక, గణాంక అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీవో) వి.పూర్ణచంద్రరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రణాళిక, గణాంక అధికారులకు ఏర్పాటు చేసిన నీటి వనరుల గణనపై శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీపీవో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నీటి వనరులను గ్రామాలు, వనరుల వారీగా గణన చేసేందుకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. శిక్షణ పొందిన అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి, డివిజనల్ ఉప గణాంక అధికారి, కార్యాలయ ఉప గణాంక అధికారి, మండల ప్రణాళిక, గణాంక అధికారులు పాల్గొన్నారు.