
రూ.63 వేల విలువైన దేశీదారు ధ్వంసం
రెబ్బెన: పోలీసుల తనిఖీలో పట్టుబడిన రూ.63వేల విలువైన దేశీదారు బాటిళ్లను గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఎకై ్సజ్, పోలీసు సిబ్బంది ధ్వంసం చేశారు. గత డిసెంబర్ 31న రాత్రి కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద రెబ్బెన పోలీసులు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న 18 కాటన్ల దేశీదారు బాటిళ్లు లభ్యమయ్యాయి. పట్టుబడిన మద్యం స్థానిక పోలీస్ స్టేషన్‌లో భద్రపర్చగా గురువారం ఎకై ్సజ్, స్థానిక పోలీస్ సిబ్బంది బాటిళ్లను జేసీబీతో ధ్వంసం చేశారు.
నాటుసారా పట్టివేత
మండల కేంద్రంలోని ప్రగతినగర్‌కు చెందిన లావుడ్య రమేశ్ వద్ద 3 లీటర్ల నాటుసారాను పట్టుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎకై ్సజ్ ఇన్‌చార్జి సీఐ రమేశ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మణ్, కానిస్టేబుళ్లు కమలాకర్, మమత, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.