
దొంగను పట్టించిన బైక్ నంబర్
కుంటాల: మహిళ మెడలో నుంచి గొలుసు చోరీకి యత్నించిన దొంగను బైక్ నంబర్ ఆధారంగా పట్టుకున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని అందకూర్ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు గత నెల 30న తమ కుమారుడితో కలిసి బైక్‌పై కుభీర్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో కల్లూరు బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మహిళ మెడలో నుంచి గొలుసు చోరీకి యత్నించాడు. వెనుక నుంచి వస్తున్న అందకూర్ గ్రామానికి చెందిన రవి గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్ని వెంబడించి నంబర్ నోట్ చేసుకున్నాడు. బైక్ నంబర్ ఆధారంగా నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ గ్రామానికి చెందిన సాయికిరణ్‌గా గుర్తించారు. గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.