
ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్‌కు గాయాలు
రెబ్బెన: మండ ల కేంద్రంలోని జర్నలిస్టు కాలనీవద్ద జాతీయ రహదారిపై గురువారం డివైడర్‌ను ఢీకొట్టి ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. రెబ్బెన వైపు నుంచి పులికుంట వైపు ఇసుకలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి జాతీయ రహదారి డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తాపడింది. పులికుంటకు చెందిన డ్రైవర్ దుర్గం మారుతికి తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. ఎస్సై చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
అరగంటయినా రాని అంబులెన్స్
జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి చేర్చేందుకు నే షనల్ హైవే అధికారులు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతారు. గురువారం జరి గిన ఘటనపై స్థానికులు అంబులెన్స్‌కోసం నేషనల్ హైవే అధికారులకు ఫోన్‌చేస్తే అరగంట దాటినా అంబులెన్స్ రాలేదు. డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో 108కు సమాచారం అందించగా వాహనంలో మంచిర్యాలకు తరలించారు. డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించాక నేషనల్ హైవే అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకుంది. అయితే ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోవాల్సిన నేషనల్ హైవే అంబులెన్సు తీవ్ర జాప్యం చేస్తూ ఆలస్యంగా రావడంపై వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు.
యాప్ ఓపెన్‌తో ఖాతాలో రూ.50 వేలు మాయం
జన్నారం: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో సెల్‌కు వచ్చిన ఒక యాప్ మెసేజ్‌ను ఓపెన్ చేసిన వ్యక్తి ఖాతాలోంచి రూ.50 వేలు మాయమయ్యాయి. బాధితుడు తెలిపిన వివరాల మేరకు జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన దాసరి చంద్రమోహన్ ఉపాధి నిమిత్తం కొంతకాలంగా కరీంనగర్‌లో నివాసం ఉంటున్నాడు. గురువారం తన ఫోన్‌కు ఎస్‌బీఐ రివార్డు పేరుతో ఒక వాట్సప్ మెసేజ్ వచ్చింది. దానిని ఓపెన్ చేయడంతో తన ఖాతాలో నుంచి రూ.50 వేలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చిందని బాధితుడు వాపోయాడు. సైబర్ నేరగాళ్ల పనే అయిఉంటుందని కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.