
కళలు సంస్కృతికి ప్రతిబింబాలు
నిర్మల్‌ఖిల్లా: కళలు సాంస్కృతిక వైభవాన్ని చాటే ప్రతిబింబాలని, కళాకారులు సాంస్కృతిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ముందుకు సాగాలని చలనచిత్ర, టీవీ కళాకారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆడిచర్ల రాజు, జన్ను అనిల్‌కుమార్ అన్నారు. జిల్లా నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో చలనచిత్ర టీవీ కళాకారులు ప్రత్యేక అభిరుచితో తమ ప్రతిభను చాటుతూ రాణిస్తున్నారన్నారు. వీరి సంక్షేమం కోసం సంఘం తరఫున తగిన కృషిచేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా అడిచర్ల రాజు, ప్రధాన కార్యదర్శిగా జన్ను అనిల్‌కుమార్, కోశాధికారిగా సామెర్ల రాజన్న, ఉపాధ్యక్షులుగా చెట్‌పల్లి కమలాకర్, నరసయ్యచారి, వెన్నెల రాజేందర్, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ కత్తి కిరణ్, ప్రచార కార్యదర్శిగా గర్దాసు నరేందర్, సహాయ కార్యదర్శిగా కృష్ణవర్మ, కార్యనిర్వాహక కార్యదర్శిగా రాం రమేశ్, ఎర్ర రవీందర్, సలహాదారులుగా టీఎన్జీవో ప్రభాకర్, పురుషోత్తం, మోహన్‌రావు ఎన్నికయ్యారు.