
అమ్మా వందనం..
తల్లులకు పిల్లలన్నా.. ఇల్లన్నా ఎంతో ప్రేమ. ఆ తల్లుల ప్రేమ ఇల్లు, పిల్లలకే పరిమితం కాలేదు. దేశాన్నీ ప్రేమించారు. మాతృభూమిపై మమకారంతో దేశ సేవ కోసం పిల్లలకు ఉగ్గుపాల నుంచే దేశభక్తిని నూరిపోశారు. నేడు ఎంతోమంది సైనికులు సరిహద్దులో దేశ సేవ చేస్తున్నారంటే ఆ మాతృమూర్తులే కారణం. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సైనికుల విజయం వెనుక ఉన్నది ఆ తల్లులే. దేశానికి ఎంతోమంది వీర సైనికులను అందించిన తల్లులపై నేడు మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.
● దేశ సేవకు పిల్లలను పంపిన మాతృమూర్తులు ఎందరో..
● నేడు మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.