
డప్పు కళాకారుడికి అవార్డు
జన్నారం: మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన డప్పు కళాకారుడు కొండుకూరి రాజుకు గద్దరన్న ఐకాన్–2025 అవార్డు లభించింది. హైదరాబాదులోని బీఎం బిర్లా సైన్స్ సెంటర్‌లో సాయి అలేఖ్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, సాంస్కృతిక సారధి చైర్‌పర్సన్ వెన్నెల, తెలంగాణ జేఏసీ నా యకుడు కవి గాయకుడు దరువు అంజన్న పాల్గొన్నారు. అవార్డులు ప్రదానంచేసి సత్కరించారు. కొండుకూరి రాజు అతిథుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
నాగరాజుకు..
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణానికి చెందిన ధూంధాం కళాకారుడుడు అంతడుపు ల నాగరాజుకు సాయిఅలేఖ్య సాంస్కృతిక సంఘ సేవా సంస్థ వారు గద్దర్ ఐకాన్ అవా ర్డు 2025ను ప్రదానం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అవార్డు అందుకున్నారు.