● సీపీ అంబర్ కిషోర్ ఝూ
మంచిర్యాలక్రైం: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్ర త్యేక చర్యలు తీసుకోవాలని సీపీ అంబర్ కిషో ర్ ఝా అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ పై శుక్రవారం రామగుండం కమిషనరేట్‌లో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్ అధికా రుల సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీ య, రాష్ట్ర రహదారులు, ఇతర రహదారులపై 2022–24 మధ్య జరిగిన రోడ్డు ప్రమాదాల వి వరాలు, మృతులు, కారణాలు, తీసుకున్న చ ర్యలు, బ్లాక్‌స్పాట్ గుర్తింపు తదితర అంశాలపై ట్రాఫిక్, పోలీస్ అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బ్లాక్ స్పాట్స్, రోడ్డు ప్రమాదాలపై పవర్ గూగుల్ మ్యాపింగ్ ద్వారా వివరించారు. సీపీ మాట్లాడుతూ బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్పీడ్ బ్రేకర్లు, తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రేడియం స్టి క్కర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీ పీ రాజు, ఎస్‌బీ ఏసీపీ రఘవేంద్రరావు, ట్రా ఫిక్ ఏసీపీ నరసింహులు, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్, సివిల్ పోలీస్ అధికారులు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.