
వాట్సప్ లింక్ ద్వారా రూ.64,500 మాయం
గట్టు: పీఎం కిసాన్ పేరుతో వచ్చిన వాట్సప్ లింక్ ఓపెన్ చేసిన ఓ రైతు బ్యాంక్ నుంచి డబ్బులు మాయమైన సంఘటన గట్టులో చోటుచేసుకుంది. బాధిత రైతు కథనం ప్రకారం.. గట్టుకు చెందిన రైతు లక్ష్మన్న తన సెల్ నంబర్ (వాట్సప్)కు పీఎం కిసాన్ పేరుతో మెసేజ్ రావడంతో లింక్‌ను ఓపెన్ చేశాడు. దీంతో తన ఖాతాలో ఉన్న రూ.64,500 ఖాళీ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న రైతు బ్యాంక్‌లో అకౌంట్ చెక్ చేసుకోగా డబ్బులు బదిలీ అయ్యాయని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. అప్పటికే ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో రైతు బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.