సంతానం లేదని మహిళ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

సంతానం లేదని మహిళ ఆత్మహత్య

Jul 3 2025 4:41 AM | Updated on Jul 3 2025 4:41 AM

సంతానం లేదని  మహిళ ఆత్మహత్య

సంతానం లేదని మహిళ ఆత్మహత్య

అయిజ: సంతానం కాలేరని మనస్తాపానికి గురైన మహిళ ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాసరావు కథనం ప్రకారం.. అయిజకు చెందిన వెంకటేశ్‌కు రెండేళ్ల క్రితం సమీప బంధువైన భువనేశ్వరి (23)తో వివాహమైంది. ప్రైవేటు దుకాణంలో వెంకటేశ్‌ గుమాస్తాగా పనిచేస్తుండగా భువనేశ్వరి ఇంటి వద్దే ఉండేది. వీరికి సంతానం లేకపోవడంతో భువనేశ్వరి తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఇంటికి వచ్చిన భర్త తలుపు కొడితే తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు విరగొట్టి లోపలికెళ్లి చూస్తే భార్య ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఆస్పత్రికి తరలిస్తే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ

వ్యక్తి మృతి

ఉండవెల్లి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, ఎస్‌ఐ శేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బుక్కాపురం గ్రామానికి చెందిన రంగస్వామి(40) బైక్‌పై మంగళవారం కర్నూల్‌ నుంచి బుక్కాపురం వెళ్తుండగా, వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో రంగస్వామి తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కర్నూల్‌ ఆస్పత్రికి తరలించిన విషయం విధితమే. చికిత్స పొందుతూ రంగస్వామి మృతి చెందాడు. అతని భార్య కుర్వ సుజాత ఫిర్యాదు మేరకు బొలెరో వాహనం డ్రైవర్‌ నరేష్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రెండు ప్రాణాలు కాపాడిన పోలీసులు

ఎర్రవల్లి: కుటుంబ కలహాలతో ఓ వివాహిత జీవితంపై విరక్తి చెంది అభంశుభం తెలియని తమ ఏడాది బాలుడితో కలిసి బుధవారం కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా, స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రెండు నిండు ప్రాణాలను కాపాడారు. ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని చెలిమిల్ల గ్రామానికి చెందిన మహిళ భర్తతో నిత్యం తగాదాల కారణంగా జీవితంపై విరక్తి చెందింది. తన కుమారుడితో కలిసి బీచుపల్లికి వచ్చి కృష్ణానది పుష్కరఘాట్‌ దగ్గర నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఇటిక్యాల బ్లూకోర్ట్‌ పోలీసులు శ్రీనివాసులు, వాజిద్‌ లు దీనిని గమనించి చాకచక్యంగా వ్యవహరించి స్థానిక గజ ఈతగాళ్ల సహకారంతో మహిళతో పాటు బాలుడి ప్రాణాలతో కాపాడారు. అనంతరం ఆమె పూర్తి వివరాలను తెలుసుకొని కౌన్సెలింగ్‌ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలి పారు. వివాహిత ప్రాణాలను కాపాడిన పోలీస్‌ సిబ్బందిని పలువురు అభినందించారు.

‘ఎన్‌ఎంఐఎంఎస్‌’కు

న్యాక్‌ ఏ–ప్లస్‌ ఫ్లస్‌ గ్రేడ్‌

జడ్చర్ల టౌన్‌: మండలంలోని పోలేపల్లిలో ఉన్న ఎస్‌వీకేఎం ఎన్‌ఎంఐఎంఎస్‌ (డీమ్డ్‌ యూనివర్సిటీ)కి న్యాక్‌ ఏ ప్లస్‌ ఫ్లస్‌ గ్రేడ్‌ కేటాయించిందని వైస్‌ చాన్స్‌లర్‌ డా. రమేశ్‌భట్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌ బృందం 4వసారి యూనివర్సిటీని సందర్శించి 3.67 అత్యుత్తమ సీజీపీఏతో ఏ ప్లస్‌ ఫ్లస్‌ గ్రేడ్‌ అందించిందని పేర్కొన్నారు. ఈ మైలురాయిలో అండగా నిలిచిన, సహకరించిన, లక్ష్యాన్ని విశ్వసించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌, అకాడమిక్‌ కౌన్సిల్‌, విద్యార్థి సభ్యుల బోర్డు, పూర్వ విద్యార్థులకు అభినందనలు తెలిపా రు. లభించిన ఉత్తమ గ్రేడ్‌ దేశంలో ఉన్నత విద్యలో శ్రేష్టతకు బెంచ్‌మార్క్‌గా నిలుపుతుందని.. అంతర్జాతీయ విద్యాలయాలతో వ్యూహాత్మక భాగస్వా ్డములను ఏర్పరచుకోగలుగుతుందని, అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించగలుగుతుందన్నారు.

10 నుంచిస్వయం ఉపాధి శిక్షణ

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో ఈ నెల 10 నుంచి 17వ బ్యాచ్‌ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డీవైఎస్‌ఓ (ఎఫ్‌ఏసీ) మధుసూదన్‌గౌడ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్‌ లేదా ఫెయిల్‌ అయిన యువతకు మూడు నెలలపాటు ఫ్యాషన్‌ డిజైనింగ్‌, గార్మెట్‌ తయారీ, బ్యూటీషియన్‌, కంప్యూటర్‌ కోర్సు (ఎంఎస్‌ ఆఫీస్‌), రిఫ్రిజిరేషన్‌, ఎయిర్‌ కండిషన్‌, మొబైల్‌ సర్వీసింగ్‌ తదితర వాటి రిపేరుపై శిక్షణ ఇస్తారన్నారు. 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్‌ కోర్సుల్లో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్‌ సెట్విన్‌ వారిచే సర్టిఫికెట్‌ అందజేస్తారన్నారు. ఆసక్తి గలవారు పాత డీఈఓ కా ర్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఈ నెల 9 వరకు దరఖాస్తులు అందజేయాలని కోరారు. దరఖాస్తు వెంట విద్యార్హత, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోతో జతచేయాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement