
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోu
ప్రకృతితో మహిళలది విడదీయలేని అనుబంధం.. భూమాతను పూజించాలన్నా.. పూల పండుగ బతుకమ్మను పేర్చాలన్నా.. గిరిజనుల తీజ్ వేడుక మురవాలన్నా.. మహిళల చేతుల స్పర్శ తగలా ల్సిందే.. అలాంటి అపురూపమైన అరచేతులకే అందాన్ని తెచ్చేది.. గోరింటాకు. ఆషాఢంలో చేతులకు గోరింటాకు పెట్టుకుంటే అందంతోపాటు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు సైతం దూరమవుతా యని మహిళలు విశ్వసిస్తారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన గోరింటాకు పండుగను మహిళలంతా ఆనందంగా నిర్వహించుకుంటారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సెవెన్ హిల్స్ కాలనీలో శనివా రం గోరింట పండుగ జరుపుకున్న మహిళల అభిప్రాయాలు.. వేడుక వివరాలే ఈనాటి
‘సాక్షి’ సండే స్పెషల్. – సాక్షి, మహబూబాబాద్
సంతోషంగా ఉంది
వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఒకేచోట ఉండే కాలనీ వాసులం ప్రతీ పండుగను కలిసి జరుపుకుంటాం. గోరింటాకు పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉంది. పండుగ జరుపుకునేందుకు సహకరించిన ‘సాక్షి’ మీడియాకు కృతజ్ఞతలు. పండుగల సందర్భంగా పెద్దలు చెప్పే మాటలతో ఈ తరానికి సంస్కృతి, సంప్రదాయం మీద గౌరవం పెరుగుతుంది.
– కీసర నందిని
ఒకే చోట చేరి సంబురాలు
● అందంతోపాటు ఆరోగ్యానికి మేలని అతివల విశ్వాసం
రోజంతా సందడి
గోరింటాకు పండుగ జరుపుకోవాలని అనుకున్నదే తడవుగా.. మహిళలంతా ఏకమై సమీపంలోని చెట్ల నుంచి ఆకును పాటలు పాడుతూ సేకరించారు. రోలు, రోకలితో గోరింటాకును మెత్తగా చేసి ఒకరి చేతికి మరొకరు గోరింటాకు పెట్టుకొని మురిసిపోయారు. ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో రోజంతా ఆనందంగా గడిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో పురోగతి సాధించింది. దీంతో వివిధ ప్రాంతాలు, వివిధ కులాలు, మతాలకు చెందిన సుమారు 30 కుటుంబాలు ఒకే చోట (సెవెన్ హిల్స్ కాలనీ) ఇళ్లు నిర్మించుకుని ఏ పండుగ అయినా.. కలిసి జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. కష్టసుఖాల్లో సహకా రం అందించుకుంటూ ఒకే కుటుంబంలా జీవిస్తున్నారు.
న్యూస్‌రీల్

ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025

ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025