
ఆషాఢ మాసంలో మైదాకుపై మహిళల ఆసక్తి
సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ
జీన్స్ పాయింట్లు, బికినీ డ్రెస్‌లు వేసుకొని ఆడ, మగ తేడా లేకుండా తయారు అవుతు న్న ఈ రోజుల్లో మహబూబాబాద్ పట్టణంలోని పలు కాలనీల ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలు అద్దం పట్టే విధంగా పండుగలు నిర్వహించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సంప్రదాయ దుస్తులు, నిండైన వస్త్రధారణతో పండుగలు నిర్వహించుకుంటారు. కాలనీ లోని పెద్దలు సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, అందులో ఇమిడి ఉన్న ఆధ్యాత్మికత చరిత్ర, ఆయుర్వేద గుణాలను రాబోయే తరాలకు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. కాగా, సెవెన్ హిల్స్ కాలనీలో నిర్వహించిన గోరింట పండుగలో కోట నిర్మల, తోట శిరీష, బొమ్మనపల్లి సువర్ణ, ప్రియాంక, నందిని, శ్రీలత, విజయ, జ్యోతి, అరుణ, కవిత తదితరులు ఆనందంగా పాల్గొన్నారు.

ఆషాఢ మాసంలో మైదాకుపై మహిళల ఆసక్తి

ఆషాఢ మాసంలో మైదాకుపై మహిళల ఆసక్తి